దిగులుగా విసుగ్గ చిరాగ్గ ,బాధగా ఉంటే కొద్దీ సేపు ఆలా తిరుగుతూ షాపింగ్ చేస్తే మూడు మారుతోంది అంటారు నిపుణులు. దీన్ని రిటెయిల్ థెరఫీ అంటారు . దిగులు వంటి భావన నియంత్రణలోకి వస్తుంది షాపింగ్ తో అంటారు. షాపింగ్ లో ఒక్క నచ్చిన వస్తువు కొనుక్కొని మనకు మనం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చు కోవటం తో దిగులు దూరం అవుతోందని,ఒక వేదనకు ఇది ఉపశమనం కూడా అంటున్నారు. మనకి మనం ఏంటో విలువైన వాళ్ళమని ఒక చక్కని వస్తువుని ఒక్క క్షణంలో కొనుకోగలిగిన ఆర్ధిక స్థమాత ,ధైర్యం ఉందని మనసు లోలోపల తృప్తి పడుతోందని అంటున్నారు. షాపింగ్ కు వెళ్ళి అనవసరమైనవి కొనేసి బడ్జెట్ దాటి పోవద్దనీ , ఒక పరిమితమైన ఇష్టమై,వస్తువుని మనసారా ఇష్టపడి కొనుక్కొని మీకు మీరు ట్రీట్ ఇచ్చుకోండి మళ్ళీ మంచి మడ్ వచ్చేస్తుంది అంటున్నారు అధ్యయనకారులు .

Leave a comment