వెయ్యి మంది పిల్లలను పోషించే సింధూ తాయి కి పద్మశ్రీ లభించింది. పన్నెండేళ్ల కే పెళ్లయింది.20 ఏళ్లకు ముగ్గురు పిల్లల తల్లయింది.గర్భిణీగా ఉన్న సింధు ని భర్త తరిమేస్తే పశువుల కొట్టంలో పురుడుపోసుకుంది. స్మశాన వాటికలో తలదాచుకుని శవాలకు పెట్టే పిండాల ని ఆహారంగా తీసుకున్న సిందు తాయి, బిచ్చమెత్తుకుంటున్న ఊరూరా తిరిగే సింధు తాయి 40 ఏళ్ళ తరువాత తన బిడ్డ కే కాదు వేయి మందికి అనాధ పిల్లలకు అమ్మ అయింది. ఆమె చక్కగా పాడగలదు. పాటలు పాడుతూ తన కూతురిని పోషించుకునే సింధూ తాయి వెయ్యి మందిని అక్కున చేర్చుకుని వారి పోషణ భారం తీసుకుంది.