ఈ వేసవి ఎండలకు ఈత మంచి వ్యాయామం అనిపిస్తుంది. కానీ నీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.ఈత కొలనుల్లో ఇన్ ఫెక్షన్లు రాకుండా క్లోరిన్ కలుపుతారు.దీనివల్ల చర్మం జుట్టుకు కూడా హాని జరుగుతుంది.కొన్ని చోట్ల వేడి నీటి స్విమ్మింగ్ ఫూల్స్ ఉంటాయి, నీటిని వేడి చేసేందుకు ఆటోమేటిక్ మిషన్లు వాడతారు. క్లోరిన్ కలిపిన వేడి నీటితో చర్మంలోని సహజ తేమ,నూనెలు పోతాయి.దాంతో చర్మం బరకగా అవుతుంది.జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. ఈతకొట్టే ముందర స్నానం చేసి వంటికి కొబ్బరి,ఆలివ్,బాదంనూనె వంటివి రాసుకుంటే క్లోరిన్ ప్రభావం తగ్గుతుంది.

Leave a comment