శ్రీ మహావిష్ణువే నమహః
కాకినాడ-పిఠాపురం మధ్యలో మన కోసం కొలువై ఉన్నాడు.ఇక్కడ స్వామికి షుమారు 9000 నాటి చరిత్ర వుంది అని విష్ణు పురాణం లో చూడవచ్చు.తిరుమల తిరుపతి, సింహాచలం దేవస్థానం కంటే ముందుగానే ఈ స్వామివారి ఆలయం ఉంది.
ఉత్థానపాదు మహారాజుకి ఇద్దరు భార్యలు వారికి చెరియొక కుమారులు.పెద్ద భార్య కొడుకు ధృవుడు.చిన్న భార్య కొడుకుని తండ్రి తన ఒడిలో కూర్చుని చూసి ధృవుడు కూడా తండ్రి ఒడి కోసం వెళ్ళిన పినతల్లి దుర్భాషలాడి శ్రీమహావిష్ణువుని ధ్యానం చేస్తూ నా కడుపున పుట్టాలని కోరుకో అని పంపించి వేసింది.థృవుడు తపస్సు చేసి శ్రీమహావిష్ణువుని ప్రత్యక్షమైన జరిగింది వివరించడం పిమ్మట స్వామి అనుగ్రహించి నీ చరమ దశలో అత్యంత ప్రజాదరణ పొందే స్థానం లభిస్తుంది అని థృవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంతకి తగ్గి బాలుని రూపంలో చెప్పి స్వయంభువుగా వెలసి దర్శనం ఇస్తున్నారు.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి
-తోలేటి వెంకట శిరీష