క్రాప్ టాప్ ఎప్పటి ఫ్యాషనో, అది ఇప్పుడు సాంప్రదాయ లంగాల పైకి వచ్చి చేరింది. ఇప్పటికి ట్రెండి, ట్రడిషనల్ కంఫర్ట్ అంటున్నారు అమ్మాయిలు. పొడవు లంగా పైకి పొట్టి జాకెట్ గా వేడుకల్లో హైలైట్గా వుంటుంది. పలాజో స్కర్టులకు కూడా క్రాప్ టాప్ ఫ్యాషన్. వెస్ట్రన్ లాంగ్ మిడ్డి కి, ప్లెయిన్ లంగాలకు, ప్రింటెడ్ లంగాలకు స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లు చెక్కని ఎంపిక. ఒకే రంగు లంగా క్రాప్ టాప్ వేసుకోవాలంటే ఎంబ్రాయిడరీ పని తనం జోడిస్తే సాంప్రదాయ వేడుకల్లో హైలైట్ . ఎలాగో స్కర్ట్ పైన క్రాప్ టాప్ వేసుకుంటే ఈ చలికాలానికి తగ్గట్టు పైన బ్లేజర్ కూడా వేసుకో వచ్చు.

Leave a comment