Categories
స్నానం చేసే నీళ్ళలో నిమ్మరసం పిండితే శరీరం తాజాగా ఉంటుంది. ఒక బకెట్ కి సగం కోసిన నిమ్మకాయ చాలు, టిట్రి ఆయిల్, పూదిన ఆకులు నీళ్ళలో వేస్తే మంచిదే. ముందుగా మంచి నీళ్ళు తాగుతూ ఉంటే శరీరం నుంచి వ్యాక్సిన్లు విడుదలై శారీరక దుర్వాసనలు రావు. దీంతో రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. పాదాలకు దుర్వాసన రాకుండా ఫూట్ స్ప్రే చల్లుకోవాలి. రెండు పూటల స్నానం చేయాలి అలాగే గంధం,బాదం పాలు,వేప తులసి,పసుపు,అశ్వగంధ కలిపిన పెసర పిండితో ఒళ్ళు రుద్దుకుంటే చర్మం చక్కని నునుపుగా మెరుస్తుంది. గంధం,తులసి గులాబీ రేకులు,పువ్వుల ఫేస్ ప్యాక్ తో కూడా చర్మం సువాసనతో ఉంటుంది.