బ్రహ్మజెముడు జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అయ్యింది.ముదురు గులాబి రంగులో కనిపించే ఈ డ్రాగన్ పై తోలు వలిస్తే తెల్లగా నల్లని గింజలతో ఉంటుంది.రుచికి కివి లాగే ఉండే డ్రాగన్ లో విటమిన్- సి ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి౧, బి2, బి3 లు ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపుచేస్తుంది.ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్లో ఏడు గ్రాముల పీచు అందుతోంది ఒక సగటు మనిషికి ఒక రోజుకు కావలసిన ఫైబర్ తో సమానం అందులోని చిన్న గింజల్లో  ఫాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇందులోని  మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ,స్మూతీలు చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment