చలి కాలం చలి వణికిస్తూ ఉంటే అందమైన మెత్తని మేలైన వగైరా వగైరా సుగుణాలున్న డ్రెస్ ల గురించి ఆలోచించే అవకాశమూ లేదు. అలంటి ప్రయోగాలు చేస్తే చలికి వొళ్ళంతా పగిలిపోతుంది కూడా. ఇప్పుడు నిండా స్వేట్టర్ వేసుకున్నాక దానికి సంబంధించిన ఫ్యాషన్ గురించి ఆలోచిస్తే స్కిన్నీ జీన్స్ వెచ్చగా సౌకర్యంగా బావుంటాయనిపిస్తోంది. ఫ్యాషన్ గానూ ఉంటుంది దానిపైన లూజ్ గా వుండే స్వేట్టర్ వేసుకున్న లేదా మంచి లెథర్ జాకెట్ వేసుకున్నా బావుంటుంది. స్వెట్టర్స్ లేత రంగుల్ని ఎంచుకోవాలి. మెడ చుట్టూ కప్పి వుండే కాశ్మీర్ క్రూనెక్ ఉలెన్ కోట్లు కాలర్ ఉన్న షర్టుల పై వేసుకుంటే బావుంటాయి. ఈ చలికి తగట్టు బ్లాంకెట్ ర్యాప్ స్కొర్క్ రకాలు పెద్దవిగా కనిపించేవి ఒక భుజానికి వేసుకున్నా మెడ చుట్టూ చుట్టుకున్నా అందమే.
Categories