పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని  పోషకాలు అందటానికి, కాన్పు  అనంతరం శిశువులకు అవసరమైన పాలు పట్టటానికి  వీలుగా తల్లి శరీరంలో కొన్ని  భాగాలల్లో కొవ్వు  నిలువజేసుకొంటుంది. దీనితో గర్భీణులు బరువు పెరుగుతారు. అయితే శిశువుకి పట్టే సమయంలో జీవక్రియ పుంజుకుని కొవ్వు మరింత సమర్ధవంతంగా ఖర్చు అవుతుంది. అప్పుడు బరువు తగ్గిపోతారు. పాలు పట్టే తల్లులకు గుండె పోటు పక్షపాతం ముప్పులు కొంత శాతం తగ్గుతుందని తాజా అధ్యాయినాలు చెప్పుతున్నాయి. తల్లి అయిన తర్వాత బరువు తగ్గే క్రమంలో రక్త నాళాల్లో పూడికలు కూడా తగ్గిపోతాయి. ఇది గుండె జబ్బు , పక్షవాతం ముప్పు   రాకుండా అరికడుతుందని నిపుణులు భావిస్తున్నారు. తల్లి పాలు ఇటు పిల్లకు మాత్రమే కాదు ఇటు తల్లుల ఆరోగ్యా న్ని  కూడా కాపాడుతాయని అధ్యాయినాలు చెప్పుతున్నాయి.

 

Leave a comment