ఎలుకకు పిల్లి సాక్ష్యం లాగా …… అంటారు. ఒక సంఘటన గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే దాన్ని ప్రత్యక్షంగా చుసిన సాక్షి ఎంతో నిప్పక్షపాత బుద్దితో న్యాయవక్తినుడై నష్టపోయిన వాడికి న్యాయం జరిగేలా ఉండాలి. కానీ అదే సాక్షి నష్ట పరిచిన వాడి తరఫున,అన్యాయాన్ని సమర్థిస్తూ మాట్లాడ వలసి వస్తే ఈ సామెత వాడుతారు. న్యాయంగా,ఎలుక పిల్లి పరస్పర శత్రువులు. ఎలుక కు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సాక్ష్యం పిల్లి అయితే,ఇక ఆ వ్యవహారం ఎంత అన్యాయంగా ఉంటుందీ అని బలహీనుల నోరు నొక్కే బలవంతుల న్యాయం ఏమాత్రం చెప్పగలరు నిరూపించేందుకు ఈ సామెత వాడుక లోకి వచ్చింది.
* ఎవరి వెర్రి వారికి ఆనందం.
* ఎవరి ప్రాణం వారికి తీపి.
* ఏనుగును చూసి కుక్కలు మెరిగినట్లు.
సేకరణ
సి.సుజాత