ఫిదా లో తనం చక్కదనం తో నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టారైపోయిండి. నాని తో ఎంసిఎ సినిమాలో నటిస్తున్న పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న కణం లోను తాజాగా మరో ద్విభాషా చిత్రంలోనూ సినిమా చేస్తుంది. అంటే ఒకే సారి అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆనంద పెట్టడం అన్నమాట. ఈ కొత్త సినిమాలో ధనుష్ సరసన మారి-2 లో నటిస్తుంది సాయి పల్లవి. సినిమా యాక్టర్స్ ను ఒక విషయంలో స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అంది వచ్చిన అవకాశాలు ఎంతో తెలివితో ఉపయోగించుకోవడం తెలుస్తుంది కదా. సినిమా ఇండస్ట్రీ, ఇటు చదువు, ఉద్యోగం, వ్యాపారం దేన్లో అయినా ఇదే స్ఫూర్తి కావాలి. అవకాశాలు తలుపు తడితే వెంటనే తెరివ్హి అందుకోవాలి.

Leave a comment