Categories
సంప్రదాయ సందర్భాల్లో కట్టు బొట్టు ప్రత్యేకంగా అందాలు ఉండాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం మొత్తం పూజలు,వ్రతాలతో కళకళలాడుతుంది . ఈ పండగ వేళలో పట్టు చీరెలే అందం. పువ్వుల, లతల డిజైన్ లలో తేలికైనవి బరువైన జరీలతోనూ కాంచీపురం,ధర్మవరం బెనారస్ చీరలు వచ్చాయి . సాధరణంగా ముదురు రంగులే ఫ్యాషన్ . అంచులు చీరేకొంగు ఒకేలా ఉండకపోయినా విరుద్ధమైన కాలే మ్యాచింగ్ ఎంచుకొన్న ప్రత్యేకంగానే కనబడతాయి . భారీ జారీతో చీరె,కాంట్రాస్ట్ కలర్ బ్లవుజ్ చక్కని డిజైన్ తో కుట్టించు కొంటె చీరె అందం వెయ్యింతలు అవుతుంది . జరీ భూతిలతో పాటు ప్రింటెడ్ పట్టు చీరెలూ పండగ స్పెషల్ గా కనిపిస్తున్నాయి .