Categories
లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో కూడా క్యాన్సర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాం. నేను క్యాన్సర్ గెలిచిన దాన్ని కనుక అందులో ఉండే బాధను అర్థం చేసుకోగలను అంటోంది నటి గౌతమి. డయాబెటిక్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, బిపి ఇలాంటివన్నీ ఎన్ పి డి లే వీటి పై అవగాహన కల్పించటం కోసం స్క్రీనింగ్ చేయటం చికిత్స లైఫ్ స్టయిల్ కోచింగ్ లాంటివి చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో క్యాన్సర్ కు సంబంధించిన అవగాహన సహాయ సహకారాల కోసం 8939663399 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు. నాతో సహా మా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెబుతోంది గౌతమి.