Categories
ఇవాల్టీ రోజుల్లో కూడా వేలకోట్ల రూపాయలు విలువ చేసే రాజభవనాలు వంటి ఇళ్ళున్నాయి. అలంటి వాటిల్లో ఒకటి కాలిఫోర్నియా లో ఉండే బెవర్లి హౌస్. ఈ భావన నిర్మాణానికి 165 మిలియన్ డాలర్లు అంటే 1070 కోట్ల రూపాయిలు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ గోల్డెన్ కే ఫార్మ్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్టన్ గేట్జ్ ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడీ భవన యజమాని విలియం రోడాల్ఫ్ ఇంగ్లీష్ అక్షరం H ఆకారం లో వుండే ఈ భవనంలో 50 అడుగుల వైశాల్యంలో హాలు,పెద్ద లైబ్రరీ,భవనం చుట్టు ప్రహరీ 400 ల మంది కుచ్చో గలిగే టెర్రస్ ,నైట్ క్వీన్,రెండు థియేటర్లు,స్విమింగ్ ఫూల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడా భవనంలో సినిమా చిత్రీకరణలు కూడా జరుగుతాయి. అలాగే కావాలంటే ఈ ఆరులక్షల డాలర్లు చెలించాల్సి ఉంటుంది. అంటే దాదాపు నాలుగు కోట్లన్నమాట !