లాక్ డౌన్ సమయంలో కదలకుండా కూర్చోమంటే పిల్లల వల్ల అవుతుందా ? రోజంతా ఖాళీ .ఈ విసుగు తెచ్చే సమయంలో ఒక లవ్ సాంగ్ పాడింది .రూపాలి ప్రణమిత అనే పాప .ఆమె పాటకు సంగీతం సమకూర్చాడు ఇంకో అబ్బాయి .ఆ పిల్లల క్రియేటివిటీ ఆ సంగీత సాధనాల్లో బయట పడుతోంది .చెట్టు మొదళ్ళు , కర్ర పుల్లలు వస్తువులు ఫ్యాక్ చేసుకొనేందుకు వాడే అట్ట పెట్టెలు , డబ్బా రేకు రెండు కర్ర పుల్లలతో అద్భుతమైన బాండ్ తయారైంది ఈ ఆర్కేస్ట్రాలో రూపాలి పాడిన పాటను నాలుగు లక్షల అరవై వేల మంది వీక్షకులు ఆనందం తో చూశారు .13వేల లైకులు కొట్టారు బోలెడన్ని ప్రశంసలు కురిపించారు .