Categories
తమలపాకులు చర్మసౌందర్యానికి ఉపయోగపడతాయి మొహం పై మొటిమలు,వాటి తాలూకు మచ్చలను ఈ తమలపాకు తగ్గిస్తుంది.రెండు మూడు తమలపాకులు మెత్తగా చేసి అందులో పసుపు తేనె కలిపి మొహానికి రాసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి.తమలపాకు లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గిస్తాయి.అలాగే నీళ్లలో తమలపాకులను బాగా మరిగించి వడకట్టి అందులో తేనె,నిమ్మరసం కలిపి మొహానికి రాసుకుంటే చర్మానికి తేమ అంది తాజాగా అయిపోతుంది.నీళ్లలో కొన్ని చుక్కల తమలపాకు నూనె వేయాలి.అలాగే ఈ నూనె వేడి చేసి కరిగించిన కర్పూరం కూడా వేసి ఆ మిశ్రమంలో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడిస్తే చర్మం తేటగా ఉంటుంది. మొటిమలు మచ్చలు మాయం అవుతాయి.