Categories
చలిగాలులు వీస్తూ ఉన్నాయి కాలాన్ని బట్టి జీవన విధానం ఆహారపు అలవాట్లు మారుతున్నట్లే వేసుకొనే దుస్తుల్లోనూ మార్పు తీసుకు రావాలి . సాధారణంగా శీతాకాలాన్ని తెలుపు, నలుపు ,నీలం రంగులు రిప్రజెంట్ చేస్తాయి . వీటిలో ఇండిగో రంగు ఇంకాస్త ఎక్కువ అందం ఇస్తుంది . నీలం ఊదా రంగుల మధ్యనే ,ఆరెంటి కలయికగా ఉంటుంది ఇండిగో . దీన్ని కూల్ కలర్ అంటారు . ఇండిగో బ్లు పసుపు రంగుల కాంబినేషన్ లో చాల అందం ఇస్తుంది . తెలుపు ,నీలం రంగులతో ఇండిగోకలిపినా బావుంటుంది మస్టర్డ్ ఎల్లో ,ఇండిగో కాంబినేషన్ తో సెలబ్రెటీ డిజైనర్లు సరికొత్త ఫ్యాషన్ సృష్టిస్తూ ఉంటారు . తెలుపు ఇండిగో కలయిక తో కుట్టిన డ్రస్ ఈ శీతాకాలానికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది .