Categories
రోబో టీచర్ ఐరిస్ అస్సాం గుహవాటి లోని ఒక ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పింది.నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద మేకర్స్ ల్యాబ్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ రోబోను తయారు చేశారు. సాంప్రదాయ దుస్తులైన ‘మేఖేలా చాదర్’ ధరించి, మెడలో ఆభరణాలతో పిల్లలు పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఉదాహరణలతో సహా చెప్పి పిల్లల్లో ఆసక్తి రేకెత్తించింది టీచర్. ఈశాన్య భారతదేశంలో తొలి ఎ ఐ ఉపాధ్యాయురాలుగా నిలిచింది ఐరిస్ రోబో.