Categories
ప్రపంచం మొత్తం మీద 15 వేల రకాల టమేటోలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన చక్కని వెలుతురు, ఎండ ఉంటే చాలు టమేటోల సాగు చాలా సులభం. వీటిలో రపుంజెల్ అనే రకం టమేటోను విదేశాల్లో ఎక్కువ సాగు చేస్తారు. కర్రల సాయంతో ఐదారు అడుగుల ఎత్తువరకు పెరిగే ఈ టమేటో మొక్కకు ఎర్రని గొలుసుల్లాంటి తీగల్లా వరసగా టమేటోలు వేలాడుతు పెద్దవవుతాయి. ఒక కొమ్మకు అటు ఇటు తీరుగా కాసిన ఎర్రటి టమేటోలు చాలా తియ్యగా ఉంటాయి. ఈ మొక్కల కొమ్మలకు ఒక్కోదానికి 40 చెర్రి టామేటాలు కాస్తాయి. ఈ రపుంజల్ టమేటో ఈ వేసవి పొడవున కాస్తాయి.