Categories
ప్రపంచ దేశాలన్నీంటిలో జపాన్ లో పిల్లల్లో ఊబకాయం లేకుండ ఆరోగ్యంగా ఉంటారంటున్నాయి అధ్యాయనాలు. జపాన్ లో బ్రెడ్డు,పాస్తా లకన్న బ్రౌన్ రైస్ ,కూరగాయలు,పండ్లు,చిరుధాన్యాలు ఒమేగా త్రీప్యాట్ ఆమ్లాలు ఉండే పదార్ధలకు ప్రాధన్యత ఇస్తారు. చక్కర,ఉప్పు ఎక్కువగా పెద్దవాళ్ళు తినరు. పిల్లలకు నచ్చినవి నచ్చినంతే తింటారు. కుటుంబంతో కలసి భోజనం చేస్తారు. పిల్లలకు చిన చిన్న కంచాల్లో భోజనం పెడతారు. పండ్లు,కూరగాయలు ఎక్కువగా తినేలా చూస్తారు. ప్రతిరోజు ఆరుబయట మైదనంలో ఆడుకొనేలా ప్రోత్సహిస్తారు. పిల్లలు చదివే స్కూళ్ళు దగ్గరగా ఉండేలా చూస్తారు. వాళ్ళు నడుస్తానో లేదా సైకిల్ తోక్కుతోనో స్కూలుకి వెళ్తారు. హోటళ్ళ కంటే ఇంటి భోజనానికే ప్రాధన్యత ఇస్తారు. ఈ అలవాట్లతో పిల్లలో ఊబకాయం ప్రసక్తే లేదు.