పిల్లలకు ఆరునెలలు వయస్సు దాటుతూనే తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. తమిళనాడులో దంపుడు బియ్యం, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, కందిపప్పు, సోయా, పల్లీలు, జీడిపప్పు, పెసరపప్పు, మినపప్పు, సోయా, ఎండుద్రాక్ష, యాలుకలు ఇలా 18 రకాల ఆహార దినుసులు కలిగిన పిండితో పిల్లలకు జావ తయ్యారు చేసి ఇస్తారు. మన వైపు కుడా బియ్యం రకరకాల పప్పులు పొడి గొట్టి ఆ పొడితో చేసిన జావను పిల్లలకు అలవాటు చేస్తారు. బియ్య పప్పు తో చేసిన పిండితో జావలాగా చేసి ఇందులో ఉప్పు నెయ్యి లేదా చక్కర, కలిపి పెట్టినా పిల్లలకు బలమే నెమ్మదిగా ఈ జావను కాస్త గట్టిగా చేసి ఎదో ఒక కూరగాయలు, బంగాళదుంప, క్యారెట్ వంటివి వుడకపెట్టి కలిపి పెట్టినా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏడాది నిండిన పిల్లలకు ఇంట్లో అందరు ఏం తింటే దాన్నే అలవాటు చేస్తే పిల్లాలకు అన్ని రకాల ఆహారము తినడం అలవాటు అవుతుంది.
Categories