Categories
చిన్నప్పుడు గంటల కొద్దీ నిద్రపోయే పిల్లలు పెద్దయ్యాక మిగతా ధ్యాసలు వచ్చాక నెమ్మదిగా నిద్ర తగ్గించుకొంటారు . ఎన్నోకొత్త విషయాలు నేర్చుకొంటారు . కానీ ఇతరత్రా యావల్లోపడి ,ఎనిమిది గంటలకన్నా తక్కవ నిద్రపోతే మాత్రం ఆలోచనాశక్తి తగ్గిపోవటం ఆందోళన వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కొంచెం పెద్దయ్యాక అంటే ఆరేళ్ళ పైన వయస్సున్న పిల్లలను 9 నుంచి 12 గంటలు నిద్ర అవసరం అంటున్నారు . ఒక సర్వే ప్రకారం 60 శాతం మంది పిల్లలు ఆటలు ,చదువు ,టి.వి ఫోన్ తో ఎనిమిది గంటల కన్నా తక్కువే నిద్రపోతున్నారని తేలింది అలా నిద్ర తక్కువైన వాళ్ళలో ప్రవర్తనా లోపపు,జ్ఞాపకశక్తి తగ్గటం అధ్యయన శక్తి కూడా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు అధ్యయనకారులు అందుకే చక్కగా పిల్లల్ని నిద్రపోయేలా చూడమంటున్నారు .