నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విజేతలైన ఎంతో మంది నాకు ప్రేరణ. నేను గెలుచుకున్న గోల్డ్ మెడల్ నా పసి తనంలోనే కోల్పోయిన మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. నా సక్సెస్ వెనుక మా అమ్మ నా కోచ్ ప్రోత్సాహం బలం ఉంది అంటోంది సుప్రీత్ కచ్ఛాప్.  హర్యానాలోని పంచకుల లో జరుగుతున్నాఖేలో ఇండియా యూత్‌ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్‌  3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లలో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్‌ పైన రన్నింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. జార్ఖండ్ లోని బుర్హు గ్రామానికి చెందిన సుప్రీతి తండ్రి నక్సలైట్ల చేతిలో మృతి చెందారు. తల్లి బాలమతి సుప్రీతి కి రన్నింగ్ పై ఉన్న ఆసక్తి గమనించి ప్రోత్సహించింది.

Leave a comment