ఫుడ్ కార్వింగ్ చూసాం. కూరగాయలు పండ్లతో ఎన్నో కళాఖండాలు సృష్టిస్తారు. ఇప్పుడు కాండిల్ కార్వింగ్ కూడా వచ్చేసింది. ఎంత అందంగా ఉన్నట్లయితే వీటిని వెలిగించ కుండా అలాగే టేబుల్ పైన అలంకరణ కోసం పెట్టేసుకోవచ్చు. పది రకాలు కొని షోకేస్ లో పెట్టేస్తే ఇంటికి ప్రత్యేకమైన అందం వస్తుంది. బొమ్మల్లా, పువ్వుల్లా, లతల్లాకనిపించే ఈ కొవ్వొత్తిని ఇంకొన్ని రంగుల మైనంలో ముంచి తీస్తారు. అలా రంగుల పొదలు ఏర్పడ్డాక అప్పుడు చెక్కుతారు. ఏరంగు ఏ పోర వెనుక వుందో ముందే తెలుస్తుంది కనుక ఏ గులాబీ పువ్వు చెక్కాలన్నా ముదురు రంగులు, తేలిక రంగులు, లోపలి అంచులు ఏ షేడ్ లో రావాలో ముందే నిర్ణయించుకుని ఆయా రంగుల్లో కోవోత్తిని ముంచి ఆరిన తర్వాత అనుకున్న ఆకారంలోకి తీసుకొస్తారు. ఈ కోవోత్తి కళాఖండాలు ఇంటికి దీపాల వంటి వేలుగునిస్తున్నాయి.
Categories