ఇప్పటి కాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా బెడ్ లైట్ లు మస్కిటో రిపెల్లర్ లు, సెల్ ఫోన్, లాప్ టాప్ అన్ని ఆన్ లోనే ఉంటాయి.  దీని వల్ల నిద్రపోయే సమయంలో కూడా మెదడు మేల్కొనే ఉంటుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధం పెరుగుతుందని తద్వారా జీవక్రియ లోపాలు రోగ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. పడుకునే ముందు లైట్లు ఆర్పి కిటికీలో నుంచి కూడా వెలుతురు రాకుండా చీకటి గా చేసి పడుకోవడం మంచిదని సిఫారస్ చేశారు. రాత్రి వేళల్లో కాంతికి గురైన వాళ్లలో నిద్రపట్టకపోవడం తో పాటు నాడీ వ్యవస్థ చురుగ్గా పని చేయడంతో ఎక్కువమంది ఊబకాయం, డయాబెటిస్ బారిన పడుతున్నారని పరిశోధకులు హెచ్చరించారు.

Leave a comment