Categories
ఆహారం విషయంలో చాలా మందికి ఎన్నెన్నో అపోహలు వున్నాయి. క్యారెట్ ను దాదాపు పండ్ల జాబితాలోనే కలిపెస్తాం. నారింజ రంగులో నోరూరించే క్యారెట్ ని అలాగే తినేస్తాం కూరల్లో స్వీట్సలో రకరకాల వంటల్లో వాడతాం. క్యారేట్ పచ్చివిగా తింటేనే పోషకాలు పోకుండా ఉంటాయనుకోంటారు కానీ క్యారెట్లు వండి తినే పోషకాలు పెరుగుతాయి. వందే ప్రక్రియలో కేరట్ కనకవ్వడం లోపల వున్న బీటా కెరోనిన్ అనే కీలకమైన పోషకం బయట పడుతుంది. ఈ పోషకం చర్మం జుట్టు ఆరోగ్యానికి మంచిది. అలాగే కేరెట్ లో పిండి పిచు పదార్దాలతో పాటు చక్కర కుడా ఎక్కువ ఫోలెట్ నియాసిన్ విటమిన్-సి వంటివి పుష్కలంగా దొరుకుతాయి. కంటి చూపు మెరుగు అవ్వాలంటే క్యారెట్ ఎదో రూపంలో తిని తీరవల్సిందే. ఔషదాల కంటే కుడా క్యారెట్ అద్భుతంగా పని చేస్తుంది.