నీహారికా,
చదువు ముగించి కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే అప్పటి వరకు ఉండే ఆహార్యం తో పాటు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. చాలా కాజువల్ గా వుండే అమ్మాయిలు హుందాగా, అఫీషియల్ గా కనిపించవలసి వస్తుంది. కొన్ని ఆఫీసులకయితే ఎలాగు డ్రెస్ కోడ్ ఉందనే వుంటుంది. ముందుగ కొలీగ్స్ తో చిరు నవ్వుతో వ్యవహరించాలి. అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా మాట్లాడుతున్నారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై మన వ్యక్తిత్వాన్ని అవతల వాళ్ళు బేరీజు వేస్తారు. ఉద్యోగ వాతావరణంలో ఇమిడి పోయేందుకు ఇవన్నీ శ్రద్దగా పాటించాలి. మనల్ని లక్ష్యాలకు చేరువగా తీసుకుపోగల మెంటర్ ని ఎంచుకోవాలి. వారి సలహాలు, అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి. సవాళ్ళను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. పనిలో శ్రద్ధగా ఉంటారని, అందరితో స్నేహంగా, హుందాతనంతో మెలుగుతారని యాజమాన్యం గుర్తిస్తుంది.