ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక ఆ కాదా తీసేసి రింగులు బుట్టలతో అలంకరించేవాళ్ళు. పాత కాలంలో నగల పేర్లు చాలా తమాషాగా ఉంటాయి. తమ్మే కు కాస్త పై భాగంలో తాలూకా అనే ఆభరణం. వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చ రాళ్లు అనే వాటిని పెట్టుకొనే వారట . ఇంకాస్త పైన మత్స్య బావిలీలు చెవి పై భాగంలో కాశీ పుట్లు. వీటి కింద బూగడలు చెవి పక్కన గుబ బావిలీలు చెవికి ఎన్నో పోగులుండేవి. అలనాటి ఆభరణాలు మళ్ళీ వచ్చాయి. చెవీబీ తమ్మే నుంచి పై భాగం వరకు స్టడ్స్ రకరకాల ఆభరణాలు తగిలించటం ఇప్పటి ఫ్యాషన్ ఇన్ని ఆభరణాల్లో మొహానికి అత్యంత అందం ఇచ్చే వేలాడే బుట్టలే. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ బుట్టల్ని వదిలిపెట్టరు. ఎక్కువ బంగారం తో చూడ చక్కని డిజైన్ ల తో ఎప్పటికీ మారదీ బుట్టల అందం.