సూపర్‌ మోడల్‌ షో కి ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ అకాడమీలో తీసుకొన్న శిక్షణ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఎలాటి పరిస్థితుల నైనా ఎదురుక్కొనే ధైర్యం,త్వరగా నేర్చుకోగలిగే నైపుణ్యం నన్ను లక్ష్యం దిశగా నడిపాయి అంటోంది ఎక్షా హంగ్మా సుబ్బా. ఈ 21 సంవత్సరాల సిక్కిం యువతి బాక్సింగ్ లో జాతీయ క్రీడాకారిణి సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ర్యాంప్‌ మీదకు వస్తే ‘మహీంద్రా గ్రూప్‌’ అధినేత ఆమెను వండర్ ఉమెన్ అని ట్విట్టర్ లో కీర్తించారు.

Leave a comment