Categories
జుట్టు ఒత్తుగా పెరగటం కోసం ఇంట్లో దొరికే పదార్థాలతో పోషణ అందించే సహజసిద్ధమైన ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయముక్కలు, కరివేపాకు సమపాళ్లలో తీసుకుని ముందుగా నూరి ఆ పేస్ట్ ని కొబ్బరినూనెలో వేసి సన్నని మంటపై మరిగించాలి.ఆ మరిగిన నూనె రెండు రోజులపాటు అవతల పెట్టి వడగట్టి వాడుకోవచ్చు. అలాగే పుదినా ఆకులు మెత్తగా నూరి ఆల్మండ్ ఆయిల్ లో వేసి రెండు మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. తరువాత ఆ నూనె తలకు రాసుకోవచ్చు. ఈ ఆయిల్ లో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు చుండ్రుని కూడా తగ్గిస్తాయి.