Categories
WhatsApp

ఎక్కువ సార్లు తింటుంటేనే ఆరోగ్యం

చాలా మంది మూడు పూటలా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక సారే తిని సరిపెట్టుకొంటారు. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.అయితే ఒకసారి ఎక్కువ తినే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ సార్లు కొద్ది కొద్దిగా తింటే ఆరోగ్యమని పరిశోధనల సారం. ఎందుకంటే తిన్న ప్రతిసారి కొంత బాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దానితో ఈ బాక్టీరియాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది పనిచేయడానికి కొన్ని క్యాలరీలు కావాలి. అంటే తీసుకున్న ఆహారంలో చాలా మటుకు ఆ బాక్టీరియాను నాశనం చేయడానికి సరిపోతుంది. ఈ వ్యవస్థ పని చేస్తున్నంత కాలం క్యాలరీలు అధికంగా పెరగకుండా వుంటాయి. అలాగే సరైన పోషకాహారం తీసుకోని వాళ్ళలో రోగ నిరోధక శక్తి పని చేయడానికి అవసరమైన శక్తి లేకపోవడమేనని నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద జీవ క్రియ, రోగ నిరోధక శక్తి పనితీరు తీసుకునే పోషకాహారం బాక్తీరియాలపైన ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి,

Leave a comment