కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే వ్యాయామ ప్రభావంతో తేడా స్పష్టంగా ఉంటుందిట. రక్త నమూనాలు పరిక్షిస్తే శరీరంలోని అడిపోజ్ టిష్యూ, తిన్న తర్వాత, తిన్నాక, తిన్న రెండు గంటల తర్వాత వేర్వేరుగా స్పందిస్తున్నట్లు తేలింది. కనుక ఏమీ తినకుండా ఓ గంట పాటు వ్యాయామం చేయగలిగితే ఫలితం పొందవచ్చు.

Leave a comment