నీహారికా,
కొందరు మాట్లాడుతుంటే అలా వింటూ వుండి పోవాలి అనిపిస్తుంది. ఇక కొందరి విషయం సరే సరి, మానవ సంబంధాలు నెలకొల్పడం లో కొనసాగించడంలో మాటలు ఉండాలి. అస్సలు చక్కగా మాట్లాడటం కూడా ఒక ఆర్ట్. ఏదోటి మాట్లాడుతున్నాం అన్నట్లు కాకుండా ఏ సబీజెక్ట్ గురించి మాట్లాడుతున్నా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాఖండించడం , మాకే ఎక్కువ తెలుసు అన్నట్లు ఉంటే మాటలేం సాగుతాయి . ప్రతి దానికి వాదన తో కూడిన దృక్పధం ఉంటే దాన్ని సంభాషణ అనరు యుర్ధం అంటారు. కబుర్ల టేబుల్ అలా మాటల యర్ధ భూమి కాకూడదు. నిజాయితీగా ఉండాలి . అవసరం అయినప్పుడు మన మనస్సుకు నచ్చితేనే అవతలి వాళ్లకు ఒక్క పొగడ్త ఇస్తే తప్పేం లేదు. సరదాగా నవ్వుతూ ఎలాంటి నిందారోపణ లేకుండా మాట్లాడితే వాళ్ళ క్షేమం అందరూ కోరుకుంటారు .