ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంచలన క్రీడాకారిణిగా వెలుగులోకి వచ్చించి అంచల్ ఠాకూర్. భారతీయులకు అంతగా పరిచయం లేని స్కీయింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతాకం గెల్చుకుంది అంచల్.  అంచల్ పుట్టింది మనాలి ప్రాంతంలోని బువ గ్రామం, మంచుకొండల్లో సాధన ప్రదేశం. పసితనం నుంచి తాను ఆడుకునే ప్రదేశం మంచుకొండలే. అలా ఎదిగిన అంచల్ జనవరిలో జరిగిన ఆల్ఫిన్ ఎజ్డెర్ 3200 కప్ లో అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో గెలిచిన తొలి భారాతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. ఇంతవరకు భారతీయ పురుషులు ఎవ్వరి ఇలాంటి పతాకాన్ని గెల్చుకోలేదు. ఇప్పుడు వింటర్ ఒలంపిక్స్ కు కృషీచేస్తుంది అంచల్.

Leave a comment