వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి ఆ పేస్టులో తేనె కలిపి జుట్టుకు పట్టించి, ఓ పావు గంట ఆరాక తల స్నానం చేస్తే అంత మంచి కండిషనర్ ను ఎప్పుడూ చూసి ఉండరు.

Leave a comment