కాఫీ తాగితే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా ఉంటుందనుకుంటాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కాఫీ బదులు పనిచేసే ప్రదేశం నుంచి లేచి ఐదు నిముషాలు నడిచి చూడండి. లేదా మెట్లు ఎక్కి దిగండి. రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా అయిపోతుంది అంటున్నారు. మానసిక శక్తి ఉత్తేజితమవ్వాలంటే కూర్చునే భంగిమనో నిలబడే భంగిమనో మార్చి నిఠారుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. దీన్ని పవార్ పోజ్ అంటారు. మూడు నిముషాలు ఇలా నిఠారుగా ధ్యానం లాగా ఉండగలిగితే ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి మెదడుకి ఉపశమనం అంటున్నారు. లేదా ఆసక్తిగా ఉండేవి. లేదా సరదాగా అనిపించే పుస్తకాలూ చదవండి చాలు. అలజడిగా ఉన్న మనకుసంగీతం వింటే ఉల్లాసంగా అయిపోతుంది. ఉత్పాదికతను పెంచుతోంది. కాఫీ లో తాగేకంటే కాసేపు ఏదీ ఆలోచించకుండా కూర్చోండి చాలంటున్నారు.
Categories