బంగారు పూత పూసిన దోసెల్ని తిన్నారా ?  హైదరాబాద్ లో దొరుకుతున్నాయి.  వెండి ,బంగారం కూడా ఇప్పుడు తిండిలో భాగమై కడుపలోకి జారుతున్నాయి.  ఎప్పుడో పాత రోజుల్లో సంప్రదాయ వైద్యాలు స్వర్ణ భస్మంతో కొన్నీ  ఔషదాలు  తయారు చేసేవారట.   ఇప్పటికీ  ప్రపంచంలో కెల్లా అతి ఎక్కువ బంగారాన్ని భోంచేసేది మనమే.  సంవత్సరానికి 12 టన్నుల బంగారం పెళ్ళిళ్ళు, వేడుకుల సందర్భంలో వంటకాలు, కేక్ ల్లో రాష్ట్రాల్లోని అపర కుభేరులు వడ్డిస్తున్నారు. పసిడి తినడం ఒక విలాసమైనా ట్రెండ్ . జపాన్ లో పలచని బంగారు రేకులు వేడి టీతో తాగేస్తున్నారు.  ఆరోగ్యమని భారతీయులు, పాకిస్థాన్ వాళ్ళు బంగారం తినేస్తున్నారు. రుచికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ బంగారం వేడైన పదార్థాలు,కేక్ లు ఆరగించడం ఇప్పటి ట్రెండ్.

Leave a comment