హోటల్ రూమ్స్ అంటే అన్ని సదుపాయాలతో సౌకర్యంగా ఉండేవి కదా. ఇక్కడ బస చేయాలంటే ఖరీదు ఎక్కువే కొన్ని హోటల్స్ లో తక్కువ అద్దెకు లాకర్స్ , డార్శెటరీ ల సౌకర్యం ఉంటుంది. కానీ జపాన్ లో సామాన్యుల బడ్జెట్ కు అనుగుణంగా ప్రత్యేక ఆలోచన చేశారు.అక్కడ పాడుకొనేందుకు గదులు నిర్మిస్తారు. వీటిని కేప్సూల్ గదులు అంటారు. ఒక మామూలు హోటల్ గది స్థలంలో కనీసం ఇరవై ముప్పయ్ మంది పాడుకొనే గదులు ఏర్పాటు చేస్తారు. అద్దె కూడా చాలా తక్కువ. అందరికి కలిపి ఒకేఒక బాత్ రూమ్ ఉంటుంది. బయట భోజనం చేసి ఈ గదుల్లో విశ్రాంతిగా పడుకోవచ్చు. మరీ చిన్నవిగా ఉన్నాయి కనుక కాప్సూల్ గదులు అంటున్నారు.

Leave a comment