Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Nemalika

348 Articles
సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా సినిమాల్లో మచ్చిక చేసిన గుర్రాలు వాడతారు. కానీ కంగనా అన్ని రకాల గుర్రాలపైనా స్వారీ చేసి బరువు సాధించాలనుకుంటుందిట. వివిధ జాతుల గుర్రాలు వాటిని మచ్చిక చేసుకునే విధానం గాయాలైతే ప్రధమ చికిత్స ఇవన్నీ జర్మనీ లో నేర్పిస్తారు. ఝాన్సీ రాణి వేషం వేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఈ పాత్ర కు ఎలా న్యాయం చేస్తానంటోంది. కంగనా. తగిన బరువు పెరుగుతోందిట. ఆ అపాత్రకు కావలిసిన దుస్తుల విషయంలో కూడా చాల శ్రద్ధ తీసుకుంటోందిట. మనం తేర పైన నిజమైన వీరనారిని చూస్తామన్నమాట.
Categories
Nemalika

ఆ పాత్ర కోసం ఆ మాత్రం రిస్క్ వద్దా ?

November 3, 2016
0 mins read
సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్  పాత్రలో…
Read more
సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది నా మనస్సు బరువెక్కి పోయింది. ఆడపిల్లలకు రక్షణ పద్ధతుల పై శిక్షణ ఇవ్వాలనిపించింది. శారీరకంగా ధృడంగా వుండటం కంటే ముందు మానసిక ధృడత్వం కూడా చాలా అవసరం. దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళల పై దాడులు జరగడం వంటి వార్తలు ప్రతి రోజు కనబడి నిద్రలేకుండా పోతుంది. అసలు బాధితులకు అందంగా నేను నిలబడతాను. నా వంతు వాళ్ళు కోలుకునేందుకు సాయం చేస్తా అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్.
Categories
Nemalika

బాధితుల కోసం నేనున్నానన్న రకుల్

November 3, 2016November 3, 2016
0 mins read
సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో…
Read more
చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , సక్సెస్ తర్వాత కాటమ రాయుడు ,సింగం 3 లో నటిస్తున్న శృతి ఆల్ రౌండర్ మ్యూజిక్ ఆల్బమ్స్ పాటలు యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఒకటేమిటి సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాల్లో ఆమె తేలిగ్గా ఇమిడిపోతోంది.
Categories
Nemalika

ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది

November 2, 2016
0 mins read
చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్…
Read more
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.
Categories
Nemalika

నేనో రాక్ స్టార్ అన్నది శృతి

October 29, 2016October 29, 2016
0 mins read
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి…
Read more
న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు.దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం అభివర్ణించింది. ఈ సీరీస్ లో భాగంగా మహిళల అక్రమ రవాణా కి సంభందించి ప్రియ అండ్ లాస్ట్ గర్ల్ కుడా రాబొతుంది.ఈ పుస్తకాలను ఆన్ లైన్ లొ కుడా చదువుకొవచ్చు.డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Categories
Nemalika

జండర్ ఈక్వాలిటి చాంపియన్ ప్రియ

October 28, 2016
0 mins read
న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్…
Read more
తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని అందుకే తను ఇండియా వచ్చేశా అని అప్పుడు తనకు తన భర్త దూరమయ్యడని తన దాంపత్య జీవితాన్ని పునరుద్దరించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Categories
Nemalika

తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

October 27, 2016
0 mins read
తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ…
Read more
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోతూ కుడా ఔనత్యాన్ని చాటుకుంది. ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ పర్వీన్ బాబీ సుహాగ్ ,దీవార్ ,కాలా సోనా, షాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. 1970 నుంచి 80 దాకా ఆమె బాలీవుడ్ ఫస్ట్ వుమెన్ సూపర్ స్టార్ గానే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అమితాబ్ తో అయితే వరసగా 8 సినిమాల్లో నటించింది. వాళ్లిద్దరూ హిట్ పెయిర్ అనేవాళ్ళు. కానీ హఠాత్తుగా సినిమాల్లో నుంచి మాయమైన పర్వీన్ చివరి రోజులు చాలా దారుణం.ఆమె చనిపోయిన మూడు రోజుల వరకు ప్రపంచానికి తెలియదు. షుగర్ తో ఒక చెయ్యి గాంగ్రీన్ వచ్చి పూర్తిగా పడిపోయిన స్థితిలో కనీసం లేచి నడవలేని స్థితిలో ఆమె మరణించి ఉంది. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ హాస్పటల్ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఒక్క మెతుకు ఆహరం లేదు. ఎన్నో కోట్లు ఆస్తి వదిలిపోయిన ఆమె జీవితంలో చివరి మూడు రోజులు ఆకలితో తపించి చనిపోయిందని తలుచుకుంటేనే బాధగా వుంటోంది. ఒకనాటి సూపర్ స్టార్ అందాల తార జీవితం ఇది.
Categories
Nemalika

పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

October 25, 2016
0 mins read
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ…
Read more
సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక ఇలా చాలా పెద్ద లిస్టే వుంది. ఆమె రికమెండ్ చేసిన వాళ్లలో వున్నారు. కాస్టింగ్ డైరెక్టర్ గా సినిమాకు కావలిసిన నటీనటులను ఎంపిక చేస్తారు. ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సామజిక మాధ్యమాలు ఫొటోలో షానూ శర్మ కార్యాలయంలో ఆమె అసిస్టెంట్స్ వడపోసి ఆమె ముందు పెడతారు. ఆడిషన్స్ నిర్వహించి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని దర్శకులకు రికమెండ్ చేస్తుందామె. దర్శకులు చెప్పే కధ పాత్రల తీరుతెన్నులు అర్ధం చేసుకుని ఆ ఊహలను ఆధారంగా నటుల్ని సెలెక్ట్ చేయటం ఆమె వృత్తి. తెరముందు తారలు మనకు తెలుసు. తెర వెనుక ఒక మహా సముద్రం వుంది. సెట్ లో బాయ్ దగ్గర నుంచి కెమెరాలు, లైట్లు , కాస్ట్యూమ్స్ , సెట్లు , ఆ సెట్టు సరిగ్గా నిలబడేందుకు అందులో మేకులు ఎక్కడ దిగ్గొట్టాలో తెలిసిన అసిస్టెంట్ తో సహా సినిమా అనే అందమైన కధని మన ముందు సృష్టించేందుకు తలో చేయి వేస్తారు. మనం జూనియర్ ఎన్టీఆర్ మీసాలు మెలేస్తే రెచ్చిపోతాం. ఆ మీసాలు అంటించి అవి ఊడిపోకుండా జాగ్రత్తగా కాపాడే మేకప్ అసిస్టెంట్ మొహం మీరు చూడగలరా ?
Categories
Nemalika

స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ

October 24, 2016
0 mins read
సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్…
Read more
క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా వ్యాపారవేత్త ప్రజలకు ఆదర్శం కూడా. నిరంతరం నూతన కల్పనలు ఆమె విజయ రహస్యం. మోడల్తో మొదలైన హెయిర్ స్టైల్ తో వైల్డ్ గా కనిపించే మడోనా రాను రానూ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. కాటుక కళ్ళు ఫిట్ నెస్ గా వుండే శరీరం కాప్రీ లు డెనిమ్ లతో ఆమె యువత కు ఆరాధ్య దేవతగా మారిపోయింది. తన దైన అసాధారణ మార్గంతో ఫ్యాషన్ పరిశ్రమనే శాసించగలదీమె. సంగీత ప్రపంచాన్ని ఎలా మార్చగలిగిందో ఫ్యాషన్ ను కూడా ఇంతే. ఈ వెడ్డింగ్ గౌన్ దగ్గర నుంచి డెనిమ్ టీ షర్ట్ దాకా ఆమె ఏం ధరించినా ఫ్యాషన్. బ్రిట్నీ స్పియర్స్ ఈమె ద్వారానే స్ఫూర్తి పొందనంటోంది. మడోన్నా ను ప్రత్యేకంగా ఎందుకు పరిచయం చేసుకుంటున్నామంటే ఈ ఆధునిక వ్యాపారప్రపంచాన్ని సరైన అంచనా తో అందుకోగలిగే వ్యక్తులను గుర్తుచేసుకుంటే మనం వెళ్లే దరి స్పష్టంగా కనిపిస్తోస్తుందని. అంతేగానీ మడోన్నా ఎలా జీవించిందా జెస్సికా ఎలా బతికిందా వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎవరిదైనా అనవసరం. ప్రపంచంలో టాప్ స్టార్ గా నిలబడాలంటే వాళ్ళు చేసిన కృషి మాత్రం తెలుసుకోవాలి. అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను ఒక ర్యాంక్ లో నిలబెట్టింది.
Categories
Nemalika

ఫ్యాషన్ దేవత మడోన్నా

October 24, 2016
0 mins read
క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ…
Read more
బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై జవానీ వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మాయి ఒక స్పెషల్ సెలెబ్రెటీ. సోషల్ నెట్ వర్క్ తో బోలెడు మంది అభిమానులను పోగు చేసుకుంది. ముంబై మురికి వాడల్లో వుండే వాళ్ళ కోసం పాత కుర్తీలు జీన్స్ టీ షర్ట్లు సేకరించింది. ఫ్యాషన్ రంగం సినీ పరిశ్రమ రెండు దుస్తుల తోనే నడుస్తాయి. కనుక ఎంతో మంది సెలబ్రెటీలు ఖరీదైన కుటుంబీకులు లెక్కలేనన్ని దుస్తులు డొనేట్ చేసారు. మురికివాడల్లో పేదలకు మానవ అక్రమ రవాణా బాధితులైన ఆడపిల్లలకు ఈ సేకరించిన దుస్తులు చెప్పులు ఇస్తుంది. ఈ సేవకోసం కొన్ని సినిమాల్లో బికినీ లో కుడా కొన్ని సీన్లు చేశాను. నీకు దుస్తుల విలువ తెలుసా అని అందరూ అడుగుతారు. కానీ నాకు మనుషుల విలువ వాళ్ళ అవసరాలు తెలుసు . వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాను అంటోంది లక్ష్మీ శర్మ. ఇలాంటి హీరోయిన్లను ఎంత మందిని చూసి వుంటారు?
Categories
Nemalika

పేదలకు దుస్తులు దానం చేసే హీరోయిన్

October 22, 2016
0 mins read
బాలీవుడ్ హీరోయిన్  ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో…
Read more
Categories
Nemalika

ఐరాస గుడ్ విల్ రాయబారిగా నదియా

September 17, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-26.html
Read more
Categories
Nemalika

చెల్లి చేతిలో దూకిన అన్న !

June 25, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-21.html
Read more

Posts navigation

Previous 1 … 28 29

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.