Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: WhatsApp

12557 Articles
Categories
WhatsApp

ఇదే ఫ్యాట్ లెస్ పద్దతి

April 27, 2017
0 mins read
శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా…
Read more
ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ పెరాక్సైడ్ తీసుకుని మూడు నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆహారం ఒలికిన ప్రదేశంలో, ఇంకో మరకలు మొదలైనవి తుడిచేయోచ్చు. ఉడెన్ ఫ్లోర్లయితే రెగ్యులర్ వాక్యుమ్ క్లీనింగ్ చేస్తుంటే ముందు జాగ్రత్తలు పడకపోయినా పర్లేదు. మరకలు మార్క్స్ ఏవైనా పడితే ఆ ప్రదేశంలో నీరు స్ప్రే చెయ్యాలి. లేదా ప్రత్యేకమైన వుడ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి. ల్యామినేట్ ఫ్లోర్స్ అయితే తర్వాత మరకలు పడవు. తడి గుడ్డతో తుడిచేసినా పోతాయి.
Categories
WhatsApp

ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి

April 27, 2017
0 mins read
ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్…
Read more
తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు రావు నెలకు ఒక సారి కూడా వీటిని తినని తల్లుల తో పోలిస్తే తినే వారి పిల్లల్లో ఆహార పదార్ధాల ఎలర్జీలు త్వరగా ఉంటాయని పరిశోధకులు రుజువు చేసారు. పండ్లు, పెరుగు, స్వీట్లు, పల పదార్దాలు చాలా వాటి పైన పుట్టుక నుంచి ఇష్టం వుండని కారణం కేవలం తల్లి అలవాట్ల నుంచి వచ్చేవే.
Categories
Wahrevaa

అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ

April 27, 2017
0 mins read
తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు…
Read more
ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత మరొకటే ఒకటి తర్వాత ఒకటిగా ముగించాలి. పెద్దగా వాడని అవసరం లేని వస్తువుల్ని తీసేయడం ఉత్తమం. ఇది బయట పడేద్దాం ఎవరికీ ఉపయోగ పడవు అని కొన్నింటిని ఇవి ఎవరికైనా పనికొస్తాయి. డొనేట్ చేద్దాం అని విభజించుకోవాలి. కొన్ని వస్తువులతో ఎమోషనల్ గా అనుభందం వుంటుంది. వాటిని సురక్షితంగా స్టోరేజ్ లో ఉంచాలి. ఇంట్లో అనవసరాలన్నీ తొలగించు కుంటే బుర్ర లోని వేస్టేల్ కూడా తొలగించినట్లే.
Categories
WhatsApp

చిందర వందరగా వుంటే చాలా కష్టం

April 27, 2017
0 mins read
ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన…
Read more
కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు గలవారికి ఇది మంచి ఆహారం. పళ్ళ పాచిని కూడా అరికడుతుంది. పళ్లకు చాలా మేలు చేస్తుంది.
Categories
Wahrevaa

కొవ్వు కరిగించే దానిమ్మ

April 27, 2017April 27, 2017
0 mins read
కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని…
Read more
అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్నామని చెప్పుకునే వాళ్ళల్లో రక్త పోటు, డయాబెటీస్, కాన్సర్, గుండె జబ్బులు వంటివి ఖాలీగా వున్న వాళ్ళ కంటే తక్కువేనని పరిశోధకులు గుర్తించారు. పని చేసే వాళ్ళు గదిలో పచార్లు చేయడం, పడుకోవడం, నిద్ర లేవడం డ్రెస్సింగ్, తినడం వంటివి ఇలాంటి మార్పు లేకుండా ఉత్సాహంగా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఆర్ధిక వెసులుబాటు కోసమో లేదా తీరికగా వుండటం ఇష్టం లేదనో జాబ్స్ చేసే వాళ్ళలో మానసిక శారీరక ఆరోగ్యాలు బాగున్నాయని, వాళ్ళు ఉత్సాహంగా వున్నారని, అలా వుండటమె సరైన పని అని రిపోర్ట్ తేల్చింది.
Categories
WhatsApp

వృద్దాప్యంలో పని కావాల్సిందే

April 26, 2017April 26, 2017
0 mins read
అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత…
Read more
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.
Categories
WhatsApp

తల్లి పాలతో అనారోగ్యాలు దూరం

April 26, 2017
1 min read
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే…
Read more
బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం తగ్గలేదన్నారు. వీరిలో స్ట్రెచ్ మార్క్. వెన్ను నొప్పి కూడా లేవు. బ్రాల వల్ల మహిళలకు శారీరకంగా వైద్య పరంగా అదనపు ప్రయోజనాలు ఎవీ లేవు. పైగా ఈ బ్రాల వల్ల బెస్ట్ కింద వుండే సపోర్టల్ టిష్యుల గ్రోత్ ను అడ్డుకుంటాయని రిపోర్ట్ తెచ్చింది. యవ్వనంలో మహిళలు ఈ బ్రా ధరించిన కారణంగా టిష్యులు తరిగి పోవడం తప్ప ప్రయోజనం లేదని బ్రా దరించక పోతేనే టిష్యులు కండరాళ్ళు ద్రుడంగా ఉంటాయంటున్నారు.
Categories
WhatsApp

బ్రా ధరించక పోవడం మంచిది

April 26, 2017
0 mins read
బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి…
Read more
ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 గంటల సమయం పడుతుంది. వర్క్ ఔట్ షెడ్యుల్ కు చాలినంత రికవరీ సమయం కేటాయించాలి. దీని వల్ల కల్న్దరాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు అవకాశం వస్తుంది. ఇమ్యూన్ సపోర్టింగ్ పోషకాలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారం ద్వరా తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి.
Categories
WhatsApp

అతి ఎప్పుడూ అనర్ధమే

April 26, 2017
1 min read
ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి…
Read more
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, రన్నింగ్ రెండు పరిరక్షణ ప్రభావాన్నే చూపెడతాయి. అలాగే సైక్లింగ్ కూడా శరీరంలో ప్రతి భాగానికి వ్యాయామం ఇస్తుంది. కండరాళ్ళ పని తీరు మెరుగవుతుంది. పిరుదులు, మోకాళ్ళ జాయింట్స్ మొబిలిటీ బావుంటుంది. కొవ్వు కరిగించడంలో తిరుగు లేని మార్గం సైక్లింగ్ దీనితో గంటకు 300 క్యాలరీలు కరుగుతాయి.
Categories
WhatsApp

సంపూర్ణ వ్యాయామం ఇది

April 26, 2017
0 mins read
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి…
Read more
ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి. ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి.
Categories
WhatsApp

పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి

April 25, 2017April 25, 2017
0 mins read
ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే…
Read more
గర్బిణీ స్త్రీలు బొప్పాస, అనాస వంటివి తినకూడ దని, ఆహారానికి సంబంధించి ఒక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు. అవన్నీ వింటూ పొతే అస్సలు తినేందుకు ఏమీ మిగలవు. ఇది మంచి ఆలోచన కూడా కాదు. అలాగే మీట్, చేపలు, సాల్ట్, స్పైసెస్ ఎవీ తినోద్దంతారు కొందరు. కానీ వాటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాదారాలు ఏవీ లేవు. ప్రాసెస్డ్ మీట్, సాఫ్ట్ చీజ్ వంటి బాక్టీరియా ఎక్కువగా వుండే పదార్ధాలు మాత్రం కొంచం తగ్గిస్తే మంచిది. కొందరికి కొన్ని అలర్జీలు వచ్చేవి ఉంటాయిఅలాంటివి జాగ్రత్తగా గమనించుకుని మానేయాలి. . అంటే గానీ ఇవి పడవు, వద్దు, తినకూడదు అన్న ఆలోచనలు పెట్టుకుని తాజా పండ్ల రసాలు మంచి శక్తినిచ్చే ఆహారాన్ని డైట్ నుంచి తొలగించ వద్దు. ఈ విషయంలో ఒక్క వైద్యురాలి సలహా మాత్రమే తీసుకోవాలి. గర్బిణీల దేహ స్ధితి, వేసుకునే మందుల్ని బట్టి ఆమె మంచి ఆహారం ఎలా తీసుకోవాలో చెప్తారు.
Categories
WhatsApp

ఇవన్నీ వింటే తినేందుకు ఏవీ మిగాలవు

April 25, 2017
0 mins read
గర్బిణీ స్త్రీలు బొప్పాస, అనాస వంటివి తినకూడ దని, ఆహారానికి సంబంధించి ఒక్కళ్ళు…
Read more

Posts navigation

Previous 1 … 990 991 992 … 1,047 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.