కేరళలోని కమ్మార్ కు చెందిన చిత్ర లేఖ జీవిత పోరాటం బాలీవుడ్ మూవీగా రాబోతుంది. చిత్ర లేఖ ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో ఏ పని చేయలేని భర్తను పోషించుకోనేందుకు ఆటో డ్రైవర్ అయింది. ఆటో యూనియన్ సభ్యత్వం తీసుకొంది. ఆమె కాలాన్ని దూషిస్తూ మహిళగా ఆమె ఉద్యోగాన్ని నిరసిస్తూ ఎన్నో దాడులు జరిగాయి. ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి న్యాయం కోసం పోరాడిన చిత్రలేఖను పత్రికలు, న్యూస్ ఛానేళ్లు ఎంతో ప్రశంసించాయి. ఇప్పుడామే కథ విన్న బాలీవుడ్ కథా రచయిత ఫ్రాసెర్ స్కాట్ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఆమె జీవితకథను సినిమాగా తీసేందుకు ఒప్పించాడు. చిత్రలేఖ జరిపిన పోరాటం ఇప్పుడు వెండితెరపై చూడవచ్చు.

Leave a comment