రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టక పోతే పడుకొనేందుకు 90 నిముషాలు ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి అంటున్నారు పరిశోధకులు . 5322 అధ్యయనాలు పరిశీలించి ,యూనివర్సిటీ అఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రజ్ఞులు నిర్ణయించిన విషయం ఇది . స్నానం చేసేందుకు వాడే నీటి ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీలు సెల్సియస్ మధ్య ఉంటే కాసేపటికి నిద్ర వస్తుదంటున్నారు . ఈ గోరు వెచ్చని నీటి స్నానం రక్త ప్రసరణ ను మెరుగు పరిచి సుఖ నిద్ర కు సాయపడుతుంది అంటున్నారు పరిశోధకులు . శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్పు చేసుకొనే పరుపులు తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పరిశోధకులు చెపుతున్నారు .

Leave a comment