Categories

ఆఫీసుకొ, బయటకో వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి భయం తో శరీరం మొత్తం కవర్ చేసి టూ వీలర్ పైనో కార్ లోనో వెళుతూ ఉంటాం. ఆఫీసులో ఇంట్లో పూర్తి ఏ సి ఇక శరీరానికి ముఖ్యమైన డి విటమిన్ సంగతేమిటి? సహజమైన సూర్య కాంతి తోనే డి విటమిన్ శరీరానికి అందాలి. వారం లో మూడు సార్లు అయినా మొత్తం శరీరం అంతటికీ సూర్య కాంతి తగిలేలా ఓ పావు గంట అయినా ఎండలో కూర్చోవాలి. డైట్ నుంచి విటమిన్ డి అందటం చాలా కష్టం. ఉదయ ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఏ బాల్కనీ లో ఎండ పడితే ఆ ప్రదేశంలో గడిపితే డి విటమిన్ లభిస్తుంది. దృఢంగా ఉంచేది ఇదే.