రంగ స్థలం టీజర్ విడుదలయింది. సమంత స్టిల్స్ చాలా బాగున్నాయి. ఇందులో రామలక్ష్మీ క్యారక్టర్ లో ఆమె నటిస్తోంది. అంత స్టార్ హీరోయిన్ నెత్తిన చెరుకు గడలు పెట్టుకోని ,కాలువలో బర్రెలు కడుగుతూ ఎంతో సామాన్యమైన దుస్తులతో కనిస్తోంది. పైట నడుములో తోసుకోని ఓ కాలు బండపైన పెట్టి, చేయి నడుంపైన వేసుకొని ఎవరో పిలుస్తున్నంత దూరంగా చూస్తున్నట్లు కనిపిస్తున్న ఆమె స్టైల్ అద్భుతంగా ఉంది.  అలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం సమంతకే చెందింది. చంద్రబోస్ రాసినట్లు’ తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగే’ ఉంది సమంత.  నిజంగా ఈ ప్రపంచంలో అందానికి వంద మార్కులు పడిపోతాయిగా!

Leave a comment