నటిగా ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు పద్మ శ్రీ గౌరవం కూడా సొంతం చేసుకొన్నారు . మనాలి దగ్గర లోని భాంబ్లీలో జన్మించిన కంగనా పస్తులు అనుభవిస్తూ ఎన్నో మెట్లు ఎక్కింది . మోడలింగ్ చేస్తూ ధియేటర్ ఆర్ట్ పై దృష్టి సాధించింది . తొలి సినిమా గాంగ్ స్టార్ తోనే ఆమెకు ఎన్నో అవకాశాలు వరస కట్టాయి . ఫ్యాషన్ లో ప్రియాంక చోప్రా తో కలిసి నటించింది . ఈ చిత్రంలో ఆమెకు జాతీయ పురస్కారం లభించింది . క్వీన్ ,సిమ్రాన్ చిత్రాలకి సంభాషణలు రాయటం తోనూ పాలుపంచుకొంది . తర్వలో దర్శకత్వం కూడా చేయబోతుంది కంగనా .

Leave a comment