ఆడపిల్లలని కాపాడుకోండి ,వాళ్లను బాగా పెంచండి ,వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ప్రపంచం మొత్తంగా మేధావులు మొత్తుకుంటునే ఉన్నారు. కానీ మగ పిల్లవాడి కోసం కలలు కనడం మానలేదు తల్లిదండ్రులు .  గుజరాత్ లోని జురిబుజర్జ్ గ్రామానికి చెందిన కానూ సంగోత్ రామ్ నిహ్హ్ దంపతులు ,మగపిల్లాడు పుట్టాలని కోరికతో 16 మంది ఆడపిల్లలను కన్నారు. చివర్లో ఒక అబ్బాయి పుట్టి వాళ్ళ కోరిక తీర్చాక, గ్రామాస్తులు ఏకమై ఇంత నిష్టదరింద్రంలో ఇంకా పిల్లలేమిటని ఒత్తిడి చేసి కుటుంబ నియంత్రణ ఆఫరేషన్ కు ఒప్పించారట రామ్ నిహ్హ్ ని.  నువ్వెంతైనా మొత్తుకో మగ పిల్లాడికి ఎట్లా గయినా డిమాండే అంటున్నారు. ఈ వార్త చదివిన ఎక్స్ పర్ట్స్ . ఈ రోజుల్లోనే ఇది జరిగింది ఆశ్చర్యపడాలి మరి.

 

Leave a comment