ప్రతి మనిషికీ కొన్ని కర్తవ్యాలు,ధర్మాలు ఉంటాయి. అలా ఎవరి పని వారు చేసుకుంటూ అదేదో ప్రపంచాన్ని ఉద్దేశించి నట్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు అలాంటి వారి గురించి వచ్చిన సామెత.
*ఆలికి అన్నంపెట్టి ఊరికి ఉపకారం చేశా నన్నాడట !
*ఆలుమగల పోట్లాట అద్దం పైన పెసరగింజవంటివి.
*ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
*ఆవగింజంత సందుంటే అరవై గారెలు తింటా నన్నాడట !
*ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
సేకరణ
సి.సుజాత