నిరసనలు వ్యక్తం చేసినా,ధర్నాలు చేసిన ,పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ,స్త్రీలకు ఎలాంటి న్యాయం లభించటం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. లైంగిక వేధింపులపై ఇస్తున్న ఫిర్యాదు విషయంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ పోలీసుల అనాసక్తత కు గురవుతోందని సర్వే చెపుతుంది. మహిళలు మీటూ ఉద్యమస్ఫూర్తితో ధైర్యంగా బయటకు వచ్చి తమపై జరుగుతున్న వేధింపులు గురించి చెపుతున్న న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ వారికి ఎదురవుతున్న నిర్లక్ష్యం ఉదాసీనత విషయంలో ఇవ్వాళ్టికీ మార్పేమీ లేదని కమిషన్ తన సర్వే నివేదికలు స్పష్టం చేసింది.