ముందు చూపు చాకచక్యం తో మహిళా నేతలు కరోనా సమయాన్ని సమర్థవంతంగా దాటుకొచ్చారు.అనారోగ్యం భయం నుంచి విముక్తి పొంది ఏప్రిల్ 15 వ తేదీన బడులు తెరిచిన తొలి యూరోపియన్ దేశంగా పేరు తెచ్చుకుంది డెన్మార్క్.ఈ విజయానికి కారణం ప్రధాన మంత్రి మెట్టే ఫెడ్రిక్ సెన్ ఆలోచన ,దాన్ని ఆచరణలో పెట్టిన విధానం మాత్రమే, డెన్మార్క్ లో ఫిబ్రవరి 27న తొలి కరోనా కేసు నమోదయ్యింది.మార్చి 11న తొలి కరోనా మరణం.మార్చి 13 నే లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం ఆ దేశంలో కరోనా మరణాలు ఎక్కువే అయినా కట్టుదిట్టమైన ఆంక్షలు టెస్ట్ ల ఆధారంగా కరోనా ను అడ్డుకోగలిగారు చాలా తొందరలోనే ప్రీ  కోవిడ్ -19 దశకు చేరుకుంది డెన్మార్క్.

Leave a comment