నవ్వితే ముత్యాలు రాలిపడినట్లు ఉండాలంటారు. అయితే కాఫీ,టీ లు తాగి తాగి తెల్లని పళ్ళ వరుస కాస్త పసుపు రంగులోకి మారి పోతాయి. చిన్న చిట్కాలతో పచ్చని పళ్ళను మెరిపించవచ్చు. కమలా ఫలం తోక్క తీసుకొని తెల్లగా ఉండే లోపలి భాగంతో దంతాలపైన రుద్ది పది నిమిషాలు అలా వదిలేసి బ్రష్ చేసుకోవాలి.ఇలా రాత్రిళ్ళు ఒక వారం పాటు చేస్తే కమలపండులో ఉండే విటమిన్ సి కారణంగా దంతాలు మెరుస్తాయి. స్ట్రా బెర్రీలు పెస్ట్ లా చేసి ఆ గుజ్జుతో పళ్ళు తోమినా పచ్చగా ఉన్నా పళ్ళు తెల్లగా మెరిసి పోతాయి. నిమ్మరసం ఉప్పుతో కడిగినా తెల్లగా అయిపోతాయి.

Leave a comment